‘మా’కు మెగాస్టార్ రాజీనామా ?

మా (మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌) క్రమ శిక్షణ సంఘం నుంచి మెగాస్టార్‌ చిరంజీవి తప్పుకొన్నట్లు తెలుస్తోంది. 2019 మార్చిలో ‘మా’ అధ్యక్షుడిగా నరేష్ ఎన్నికైన సంగతి తెలిసిందే. ఆ తర్వాత కొన్నాళ్లకే మాలో విబేధాలు తలెత్తాయి. నరేష్-రాజశేఖర్ ల మధ్య వివాదం రాజుకుంది. అది కాస్త ముదిరింది. బయటికి పొక్కింది. హెడ్ లైన్స్ లోకి ఎక్కింది. ఆ తర్వాత కృష్ణంరాజు, చిరంజీవి, మోహన్‌బాబు, మురళీమోహన్‌ జయసుధలతో కూడిన ఓ క్రమశిక్షణా సంఘం ఏర్పాటైంది. 


మా విబేధాలు కొనసాగుతున్న టైమ్ లోనే కరోనా వెలుగు చూసింది. ఆ సమయంలో చిరంజీవి ముందుండి సీసీసీ అనే సంస్థను ఏర్పాటు చేసి.. విరాళాలు సేకరించి సినీ కార్మికులను ఆదుకున్నారు. అయితే ఇప్పుడు మెగాస్టార్ సడెన్ షాక్ ఇవ్వబోతున్నట్టు తెలుస్తోంది. ఆయన మా క్రమశిక్షణ కమిటీకి రాజీనామా చేయబోతున్నట్టు తెలుస్తోంది. మా ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో చిరంజీవి రాజీనామా చేయడం ప్రాధాన్యతని సంతరించుకుంది.