వకీల్ సాబ్ థియేటర్స్ లో ఖిలాడి !

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అభిమానులు ఒకే టికెట్ పై రెండు సినిమాలు చూసే ఛాన్స్ కొట్టేసేలా ఉన్నారు. వకీల్ సాబ్ గా పవన్ రేపు ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ రాత్రి నుంచే స్పెషల్ షోస్ పడిపోనున్నాయ్. దీంతో వకీల్ సాబ్ సెలబ్రేషన్స్ ఆల్రెడీ మొదలైపోయాయ్. థియేటర్స్ వద్ద అభిమానుల సందడి మొదలైంది. 

ఇలాంటి టైమ్ లో పవన్ ఫ్యాన్స్ కి మరో గుడ్ న్యూస్ వచ్చేసింది. మాస్ మహారాజ రవితేజ తాజా చిత్రం ‘ఖిలాడి’ టీజర్ అప్ డేటు రేపు ఉదయం 9:09 నిమిషాలకు ఇవ్వబోతున్నారు. అదేంటంటే.. ? ఉగాధి కానుకగా ఖిలాడీ టీజర్ ని విడుదల. అయితే ఉగాధికి రాబోతున్న ఖిలాడి టీజర్ వకీల్ సాబ్ థియేటర్స్ లో ప్లే చేయనున్నారు. దీంతో.. పవన్ ఫ్యాన్స్ ఒకే టికెట్ పై వకీల్ సాబ్ టీజర్ తో పాటు ఖిలాడి టీజర్ ని కూడా చూడబోతున్నారు అన్నమాట. 

వాస్తవానికి పవన్ సినిమాల వలన రవితేజకు పేరొచ్చింది. పవన్ తో చేయాల్సిన సినిమాలన్నీ రవితేజ వెళ్లాయి. రవితేజతో పూరి జగన్నాథ్ తీసిన ఇడియట్, అమ్మానాన్న ఓ తమిళ అమ్మాయి కథలు పవన్ కోసం రాసుకున్నవే. ఈ విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో పూరి చెప్పిన సంగతి తెలిసిందే. పవన్ ఓకే చెప్పని మంచి కథలన్నీ రవితేజకు పడ్డాయ్.