ముంబై ఇండియన్స్ గెలుపు సీక్రెట్.. ఇదే !

ఐపీఎల్ పండగ వచ్చేస్తోంది. ఐపీఎల్ 14 సీజన్ లో భాగంగా రేపు తొలి మ్యాచ్ ముంబై-బెంగళూరు జట్ల మధ్య జరగనుంది. అయితే ఐపీఎల్ అనగానే ముంబై ఫేవరేట్ గా మారిపోయింది. ఆ జట్టు అత్యధిక సార్లు టైటిల్స్ గెలిచింది. 2019, 2020లోనూ  ఐపీఎల్ టైటిల్స్ ముంబైదే. ఈసారి కూడా గెలిచి.. హ్యాట్రిక్ కొట్టాలని చూస్తోంది. ఇంతకీ.. ముంబై గెలుపు సీక్రెట్ ఏంటీ.. ? సరిగ్గా మెగా టోర్నీ ప్రారంభానికి ఒక్కరోజు ముందు ఆ సీక్రెట్ చెప్పేశారు.. ముంబై ఇండియన్స్ బ్యాట్స్ మెన్ సూర్య కుమార్ యాదవ్.

గురువారం మీడియాతో మాట్లాడిన సూర్య..  ‘గెలిచినా.. ఓడినా.. ఒకే రకంగా ఉండటమే తమ గెలుపు సీక్రెట్ అన్నారు. డ్రస్సింగ్‌ రూమ్‌లో మా జట్టు వైవిధ్యంగా ఉంటుంది. మైదానంలో చూసిందానికి వ్యతిరేకంగా కనిపిస్తుంది. అక్కడి వాతావరణాన్ని సరదాగా మార్చేసే ఆటగాళ్లు ఉన్నారు. ఇషాన్‌ కిషన్‌, కీరన్‌ పొలార్డ్‌, హార్దిక్‌ పాండ్య.. గెలిచినా ఓడినా సరదాగానే ఉంటారు. వాళ్లను మరోవైపు నుంచి చూస్తే మీరు షాకవుతారు! ఎందుకంటే డ్రస్సింగ్‌ రూమ్‌లో వింత వింత మనస్తత్వాలు కనిపిస్తాయి, వారి వల్లే ఫలితాల ప్రభావం మాపై ఉండదు. మేం గెలిస్తే వాతావరణం చాలా బాగుంటుంది. ఓడినా.. సంతోషకరమైన వాతావరణం ఉండేలా చేస్తారు. గెలిచినా.. ఓడినా.. ఒకే రకంగా ఉండటమే మా గెలుపు సీక్రెట్’ అని చెప్పుకొచ్చాడు.