ప్రధానితో భేటీకి మమత డుమ్మా !

ప్రధాని నరేంద్ర మోడీ ఈరోజు సాయంత్రం రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశం కానున్నారు.  కొవిడ్‌ తాజా పరిస్థితులు, వ్యాక్సినేషన్‌ సంబంధిత అంశాలపై ప్రధాని ముఖ్యమంత్రులతో చర్చించనున్నారు. అయితే, ఈ సమావేశానికి పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ దూరంగా ఉంటున్నట్లు సమాచారం. ఆమె స్థానంలో బెంగాల్‌ ప్రధాన కార్యదర్శి ఆలాపన్‌ బందోపాధ్యాయ్‌ హాజరుకానున్నట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి.

గత ఆదివారం కేంద్ర, రాష్ట్రాల ఉన్నతాధికారులతో సమావేశమైన ప్రధాని.. కరోనా కట్టడికి అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ఐదంచెల వ్యూహాన్ని అమలు చేయాలని దిశానిర్దేశం చేశారు. టెస్టింగ్‌, ట్రేసింగ్, ట్రీట్‌మెంట్‌,  కొవిడ్‌ జాగ్రత్తలు, నిబంధనలను పాటించడం, వ్యాక్సినేషన్‌.. ఈ పంచముఖ వ్యూహాన్ని అమలు చేయాలని సూచించారు. ఈరోజు భేటీలోనూ ప్రధాని మరికొన్ని కీలక సూచనలు, సలహాలు ఇస్తారని సమాచారమ్.