ఐపీఎల్ పై ఆఫ్రిది అసంతృప్తి

దక్షిణాఫ్రికా జట్టు పాకిస్థాన్ టూర్ లో ఉన్న సంగతి తెలిసిందే. ఐతే సిరీస్ మధ్యలోనే ఆ జట్టులోని కీలక ఆటగాళ్లు ఐపీఎల్ కోసం భారత్ కు వచ్చేశారు. పాక్-దక్షిణాఫ్రికాల మధ్య మూడు వన్డేల సిరీస్‌ జరగ్గా పాక్‌ 2-1 తేడాతో గెలుపొందింది. రెండో వన్డేలో దక్షిణాఫ్రికా విజయం సాధించాక ఆ జట్టు ఆటగాళ్లు.. కగిసో రబాడ, క్వింటన్‌ డికాక్‌, ఆన్‌రిచ్‌ నోర్జే, డేవిడ్‌ మిల్లర్‌, లుంగి ఎంగిడి ఐపీఎల్ కోసం భారత్‌కు వచ్చారు. దీనిపై అఫ్రిది అసంతృప్తి వ్యక్తం చేశారు.

‘క్రికెట్‌ దక్షిణాఫ్రికా అధికారులు పరిమిత ఓవర్ల క్రికెట్‌ మధ్యలో ఐపీఎల్‌ కోసం తమ ఆటగాళ్లను అనుమతించడం ఆశ్చర్యంగా ఉంది. టీ20 లీగులు అంతర్జాతీయ క్రికెట్‌పై ప్రభావం చూపడం బాధగా ఉంది. దీనిపై పునరాలోచించాల్సిన అవసరం ఉంది’ అని అఫ్రిది ట్విట్ చేశారు. ఇక రేపటి నుంచే (ఏప్రిల్ 9) ఐపీఎల్‌ 14వ సీజన్‌ ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే.