‘వకీల్ సాబ్’ థియేటర్ లో దిల్ రాజు సందడి !

వకీల్ సాబ్ గా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ప్రేక్షకుల ముందుకొచ్చేశాడు. దీంతో థియేటర్స్ వద్ద పవన్ అభిమానుల హంగామా మొదలైంది. గురువారం రాత్రి నుంచి మొదలైన బెనిఫిట్ షోస్ తోనే అభిమానుల సందడి స్టార్ట్ అయింది. ఈ గ్యాంగ్ లో నిర్మాత దిల్ రాజు కూడా చేరారు. హైదరాబాద్ శివపార్వతి థియేటర్‌లో దిల్‌రాజు దంపతులు ‘వకీల్‌సాబ్‌’ షో వీక్షించారు. పవన్‌ ఎంట్రీ సీన్‌కు అభిమానులతో కలిసి ఆయన కాగితాలు విసిరి.. సందడి చేశారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. 

మరోవైపు తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్ల వద్ద పవన్‌ అభిమానులు భారీగా సంబరాలు జరుపుకొంటున్నారు. పవన్‌ కటౌట్లకు పాలాభిషేకాలు చేస్తున్నారు. టపాసులు కాల్చి.. డ్యాన్సులు చేస్తూ తమ ఆనందాన్ని తెలియజేస్తున్నారు. బాలీవుడ్ హిట్ పింక్ కు రిమేక్ ఇది. ఇందులో బిగ్ బీ అమితాబ్ నటించిన పాత్రలో పవన్ నటించారు. ఈ చిత్రానికి వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించారు. బోనీ కపూర్ తో కలిసి దిల్ రాజు నిర్మించారు. 

దిల్ మామ మాస్ 🔥 🔥#VakeelSaabDay pic.twitter.com/mKVmkdBgLv— సిద్దు- సంధ్య (@siddu404) April 8, 2021