బ్రిటన్ యువరాజు కన్నుమూత

బ్రిటన్ యువరాజు, క్వీన్ ఎలిజబెత్ భర్త ప్రిన్స్ ఫిలిప్ (99) కన్నుమూశారు. ఇటీవల అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన ఆయన.. కోలుకుని ప్యాలెస్‌కు చేరుకున్నారు.
అక్కడ తీవ్ర అనారోగ్యానికి గురికావడంతో ఈరోజు మృతిచెందారు. ఈ మేరకు బకింగ్‌హామ్ ప్యాలెస్ వర్గాలు ప్రకటించాయి.ప్రిన్స్ ఫిలిప్ మృతి పట్ల పలువురు సంతాపం తెలిపారు.