ఎరువుల ధరలు పెంచొద్దని కేంద్రం ఆదేశం
జూన్ నుంచి ప్రారంభమయ్యే ఖరీఫ్(వానాకాలం) సీజన్ ఆరంభానికి ముందే డీఏపీ, కాంప్లెక్స్(మిశ్రమ) ఎరువుల ధరలను పెంచాలని ఎరువుల కంపెనీలు నిర్ణయించిన విషయం తెలిసిందే. పెంపు సుమారు 58 శాతం ఉండటంతో ఒక్క బస్తా యూరియా రూ. 700 వరకు పలకనుంది.
యూరియాతో పాటుగా. అన్ని ఎరువుల ధరలు భారీగా పెరుగుతాయనే ఆందోళనలో రైతులు ఉననరు. ఈ నేపథ్యంలో.. యూరియా మినహా ఇతర ఎరువుల ధరలను పెంచొద్దని ఎరువుల కంపెనీలకు కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. డీఏపీ, ఎంవోపీ, ఎన్పీకేల ఎంఆర్పీ పెంచవద్దని ఆదేశించింది. యూరియా మినహా ఇతర ఎరువులను పాత ధరలకే విక్రయించాలని స్పష్టం చేసింది.