అక్కడ ‘వకీల్ సాబ్’ బెనిఫిట్ షోస్ క్యాన్సిల్.. ఎమ్మెల్యే ఇంటి ముందు అభిమానుల ఆందోళన !

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ‘వకీల్ సాబ్’ వచ్చేశాడు. గురువారం రాత్రి నుంచే ఓవర్సీస్ లో, తెలుగు రాష్ట్రాల్లోనూ వకీల్ సాబ్ బెనిఫిట్ షోస్ పడుతున్నాయి. దీంతో థియేటర్స్ వద్ద పవన్ అభిమానుల సందడి కనిపిస్తోంది. అయితే పశ్చిమగోదావరి జిల్లా నిడదవోలు మాత్రం వకీల్ సాబ్ బెనిఫిట్ షోస్ పడలేదు. 

దీంతో ఎమ్మెల్యే శ్రీనివాస్‌ నాయుడు ఇంటి ఎదుట పవన్‌ కల్యాణ్‌ అభిమానులు ఆందోళనకు దిగారు. వకీల్‌ సాబ్‌ సినిమాకోసం అభిమానులు బెనిఫిట్‌ షో టికెట్లు కొన్నారు. కానీ, థియేటర్‌లో బెనిఫిట్‌ షో వేయకపోవడంతో అభిమానులు ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితి అదుపు చేశారు. సదరు థియేటర్ ఎమ్మెల్యే శ్రీనివాస్ నాయుడుది కావడంతో.. పవన్ అభిమానులు ఆయన్ని టార్గెట్ చేశారు. టికెట్ డబ్బులు తిరిగి చెల్లిస్తామని చెప్పినా.. అభిమానులు శాంతించడం లేదు.