ట్రెండింగ్ లో.. వకీల్ సాబ్ పొలిటికల్ సటైర్ !

వకీల్ సాబ్ బొమ్మ పడిపోయింది. ఆ బొమ్మ బ్లాక్ బస్టర్ అని అప్పుడే ప్రేక్షకులు తేల్చేశారు. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన చిత్రమిది. బోనీ కపూర్ తో కలిసి దిల్ రాజు నిర్మించారు. భారీ అంచాల మధ్య వకీల్ సాబ్ ఈరోజు ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఐతే గురువారం రాత్రి నుంచే స్పెషల్ షోస్ పడిపోయాయ్. వన్ సైడ్ గా బ్లాక్ బస్టర్ టాక్ వినిపిస్తోంది. దాంతోపాటు వకీల్ సాబ్ పొలిటికల్ సైటైర్ వైరల్ అవుతోంది. అలాగని.. సినిమాలో పవన్ రాజకీయాలని టచ్ చేయలేదు. ఎవరిని టార్గెట్ చేయలేదు.

కానీ ఆయన ఫ్యాన్స్ మాత్రం ఏపీ సీఎం జగన్ ని టార్గెట్ చేశారు. ‘వకీల్ సాబ్ వచ్చేశాడు.. ఖైదీ భయపడుతున్నాడు’ #VakeelEntersKhaidhiFears యాష్ ట్యాగ్ ని వైరల్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ యాష్ ట్యాగ్ లో ఇండియాలో ట్రెండింగ్ టాప్ లో కొనసాగుతోంది. జగన్-పవన్ రాజకీయ ప్రత్యర్థులు అన్న సంగతి తెలిసిందే. సీఎం జగన్ పై పలు కేసులున్నాయి. గతంలో ఆయన జైలుకెళ్లి వచ్చారు. ఇప్పుడు కూడా కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. ఇక వకీల్ సాబ్ లో పవన్ లాయర్ పాత్రలో కనిపించారు. అన్యాయం జరిగిన ముగ్గురు ఆడపిల్లలకు మద్దతుగా వాదించారు.

ఈ సిట్యూవేషన్ ని పవన్ ఫ్యాన్స్ బాగా వాడుకుంటున్నారు. #VakeelEntersKhaidhiFears అంటూ జగన్ ని ట్రోల్ చేస్తున్నారు. అయితే ఈ పని పవన్ ఫ్యాన్స్ సరదా చేస్తున్నారా ? సీరియస్ గా చేస్తున్నారా ?? తిరుపతి ఉప ఎన్నిక వేళ కావాలనే జగన్ టార్గెట్ చేశారా ?? అన్నది వారికే తెలియాలి.