‘వకీల్ సాబ్’ ఫస్ట్ డే కలెక్షన్స్.. ‘బాహుబలి’ రికార్డ్స్ బ్రేక్ !

పవర్ స్టార్  పవన్ కల్యాణ్ సినిమా ప్రేక్షకుల ముందుకొస్తే.. ఆ కిక్కే వేరబ్బా. వకీల్ సాబ్ రాకతో నిన్న థియేటర్స్ దగ్గర పండగ జరిగింది. హిట్ టాక్ తో ఆ సంబురాలు డబుల్ అయ్యాయ్. పవన్ నుంచి అభిమానులు కోరుకొనే అన్నీ అంశాలు ఉన్నాయ్. వకీల్ సాబ్ కాదు వసూల్ సాబ్ అంటున్నారు. ఇండస్ట్రీ రికార్డులు బద్దలు కావడం గ్యారెంటీ.. రాసిపెట్టుకో సాంబా.. అంటున్నారు పవన్ ఫ్యాన్స్. వారు చెప్పినట్టుగానే తొలిరోజు నుంచే వకీల్ సాబ్ రికార్డులకి తెరలేపేశారు.

తొలిరోజు కలెక్షన్స్ లో బాహుబలి రికార్డ్స్ ని బద్దలు కొట్టారు. బాహుబలి  తొలిరోజు రూ. 7.11కోట్ల గ్రాస్ ని వసూలు చేస్తే.. వకీల్ సాబ్ రూ. 7.86 కోట్ల గ్రాస్ ని తీసుకొచ్చాడు. తొలిరోజే బహుబలి రికార్డ్స్ బద్దలు కొట్టడంపై పవన్ ఫ్యాన్స్ హ్యాపీగా ఉన్నారు. ఇక తొలిరోజు కలెక్షన్స్ పరంగా చూస్టే.. ఒకటి, రెండో స్థానంలో వకీల్ సాబ్ (7.86), బాహుబలి (7.11) ఉన్నాయి. ఆ తర్వాతి స్థానాల్లో సైరా (7.04), బాహుబలి 2 (6.80) సరిలేరు నీకెవ్వరు (6.67) ఉన్నాయి. ఇక ఓవర్సీస్ లోనూ వకీల్ సాబ్ మంచి కలెక్షన్స్ రాబడుతున్నాడు.