రైనా రీ-ఎంట్రీ.. సూపర్ !

గత ఐపీఎల్ సీజన్ లో సురేష్ రైనా ఆడలేదు. దుబాయ్ వెళ్లిన అతడు వ్యక్తిగత కారణాల వలన తిరిగి ఇండియాకు వచ్చేశాడు. అంతకుముందే రైనా అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో.. దాదాపు యేడాదికి పైగా రైనా ఆటను చూసే అవకాశం రాలేదు. అయితే నిన్న ఢిల్లీతో జరిగిన మ్యాచ్ లో తనెంత విలువైన ఆటగాడో రైనా నిరూపించుకున్నాడు.

 ఓపెనర్లు రుతురాజ్‌ గైక్వాడ్(5), డుప్లెసిస్‌(0) విఫలమైనా.. మొయిన్ అలీ (36)తో కలిసి సురేశ్ రైనా (54; 36 బంతుల్లో 3×4, 4×6) ఇన్నింగ్స్ ని చక్కదిద్దిన విధానం అద్భుతం. చూడ చకని షాట్లతో అలరించాడు. మునుపటి రైనాని చూపించాడు.

ఇక ఈ మ్యాచ్ లో టాస్‌ ఓడి మొదట బ్యాటింగ్‌ చేసిన చెన్నైసూపర్‌ కింగ్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 188 పరుగులు చేసింది. అనంతరం 189 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన దిల్లీ 18. 4 ఓవర్లలోనే మూడు వికెట్లు కోల్పోయి విజయం సాధించింది. దిల్లీ ఓపెనర్లు.. పృథ్వీ షా(72; 38 బంతుల్లో 9×4, 3×6), శిఖర్‌ ధావన్‌(85; 10×4, 2×6) ఆకాశమే హద్దుగా చెలరేగారు. ధావన్, షాలని అవుట్ చేసినా.. అప్పటికే  జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది. ఢిల్లీ విజయం సాధించింది.