ఉగాధి రోజున బాలయ్య గర్జన

నందమూరి అభిమానులకు గుడ్ న్యూస్. బాలయ్య నుంచి ఉగాధి కానుక రాబోతుంది. బాలయ్య-బోయపాటి కాంబోలో హ్యాట్రిక్ (#BB3) చిత్రం తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా టైటిల్ ని ఉగాధి కానుకగా (ఏప్రిల్ 13) రివీల్ చేయబోతున్నట్టు చిత్రబృందం తెలిపింది. టైటిల్ గర్జనకు ఉగాధిరోజున మధ్యాహ్నం 12.33 గంటలకు ముహూర్తం పెట్టారు.

బాలయ్య-బోయపాటిలది హిట్ కాంబో. వీరిలో కాంబోలో వచ్చిన రెండు చిత్రాలు సింహా, లయన్ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయ్. ఈ నేపథ్యంలో #BB3పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. వాటిని అందుకొనేలా బోయపాటి కథని రెడీ చేశారని చెబుతున్నారు. ఇందులో బాలయ్య ద్విపాత్రాభినయం చేయనున్నారు. ఓ పాత్రలో అఘోరాగా కనిపించబోతున్నారు. 

ఇక ఈ సినిమా తర్వాత క్రాక్ దర్శకుడు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలయ్య సినిమా ఉండనుంది. ఇది కూడా క్రాక్ మాదిరిగా యాక్షన్ ఎంటర్ టైనర్ అని తెలుస్తోంది.