వకీల్ సాబ్ నుంచి మరో ఆణిముత్యం.. చూసి తీరాల్సిందే !

బ్లాక్ బస్టర్ హిట్ టాక్ వచ్చిన సినిమా మళ్లీ పబ్లిసిటీ అవసరం లేదు. అందులోనూ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాకి అస్సలే అవసరం లేదు. కానీ వకీల్ సాబ్ చిత్రబృందం తగ్గడం లేదు. తాజాగా వకీల్ సాబ్ నుంచి ‘సూపర్ ఉమెన్ ‘ ప్రోమో ఒకటి విడుదల చేశారు. కోర్టుకు సంబంధించిన సీన్ ఇది. 

ఇందులో లేడీ పోలీస్ ని వకీల్ సాబ్ (పవన్) సూటిగా ఓ ప్రశ్న అడుగుతాడు. సూపర్ ఉమెన్.. అంటే అల్వాల్ లో ఉన్న ఫంక్షన్ హాల్ నుంచి.. మైనాబాద్ పోలీస్ స్టేషన్ కి సిర్ఫ్.. పద్రా మినెట్స్ లో వచ్చిర్రా అమ్మా మీరూ.. అడుతాడు. దానికి ఆ లేడీ పోలీస్.. సర్ అంత పెద్ద సంఘటన కదా అని ఏదైతే అది అయిందని.. జెడ్ స్పీడ్ లో వచ్చేసినమ్ సర్ అని సమాధానం ఇస్తుంది. దానికి పవన్ తనదైన శైలిలో వావ్.. అని రియాక్షన్ ఇవ్వడ ప్రోమోలో చూడొచ్చు. ఇందులో పవన్ టమ్ టు టైమ్ ఇచ్చిన పంచ్ లు, సటైర్స్ హైలైట్ గా ఉన్నాయ్.

ఈ చిత్రానికి వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించారు. శృతిహాసన్, అంజలి, అనన్య, నివేదా థామస్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. థమన్ సంగీతం అందించారు. బోనీ కపూర్ తో కలిసి దిల్ రాజు నిర్మించారు. బాలీవుడ్ హిట్ పింక్ కి రిమేక్ ఇది. ఇందులో బిగ్ బీ అమితాబ్ నటించిన పాత్రలో పవన్ నటించారు. బాలీవుడ్ పింక్ కోలీవుడ్ లో అజిత్ హీరోగా నటించారు. అయితే హిందీ, తమిళ్ కంటే.. తెలుగులో ఆ పాత్రని పవన్ బాగా చేశారనే ప్రశంసలు కురుస్తున్నాయి.