‘ఎఫ్3’లో ఛాన్స్ కొట్టేసిన అంజలి

‘వకీల్ సాబ్’తో అంజలి సెకెండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ అయినట్లుంది. ఆమె మరోసారి బిజీ అయిపోతుంది. లెటెస్ట్ న్యూస్ ఏంటంటే ? ఎఫ్ 3 కోసం అంజలిని తీసుకున్నారు. అనిల్ రావిపూడి-వెకటేష్-వరుణ్ ల కాంబినేషన్ లోతయారవుతున్న ఎఫ్ 3 సినిమాలో మూడో హీరోయిన్ క్యారెక్టర్ వుంది. ఈ క్యారెక్టర్ కు సోనాలీ చౌహాన్ ను తీసుకున్నారు. కానీ ఇప్పుడు కరోనా పరిస్థితుల్లో ఆమె రావడం, చేయడం అన్నది అయోమయంలో పడింది. దాంతో ఆమె స్థానంలో అంజలిని తీసుకున్నారు. త్వరలోనే ఎఫ్ 3 చిత్రబృందం మైసూర్ వెళ్లనుంది.

ఎఫ్ 2లో రెండు జంటలే (వెంకీ-తమన్నా, వరుణ్ తేజ్-మెహ్రీన్) సందడి చేశాయి. అయితే సీక్వెల్ లో మాత్రం మరో హీరో, హీరోయిన్ ఉంటారని చిత్రబృందం తెలిపింది. ఎఫ్ 3లో సునీల్ కీలక పాత్రలో కనిపించబోతున్నారు. ఆయనే  మూడో  హీరో అన్నమాట. ఇప్పుడు మూడో హీరోయిన్ గా అంజలిని తీసుకున్నారు. అంటే.. సునీల్-అంజలి జంటగా నటిస్తారా ? లేక.. అందరితో రొమాన్స్ చేసే హీరోయిన్ గా అంజలి కనిపిస్తారా ?? అన్నది ఎఫ్ 3 చూసి తెలుసుకోవాల్సిందే.