టీజర్ టాక్ : ఖిలాడి – రొమాంటిక్+థిల్లర్+యాక్షన్

రమేష్ వర్మ దర్శకత్వంలో మాస్ మహారాజ రవితేజ నటిస్తున్న చిత్రం ‘ఖిలాడి’ మీనాక్షీ చౌదరి, డింపుల్‌ హయతి హీరోయిన్లుగా. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. 

ఈ సినిమాలో రవితేజ ద్విపాత్రాభినయం చేయనున్నారు. అర్జున్‌, ఉన్ని ముకుందన్‌ కీలక పాత్రలు చేస్తున్నారు. మే 28న ఖిలాడి ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.
తాజాగా ఈ సినిమా టీజర్ ని విడుదల చేశారు. స్టోరీ లైన్ ని ఏమాత్రం రివీల్ చేయకుండా.. రొమాంటి, థ్రిల్లర్, యాక్షన్ బిట్ సీన్స్ తో టీజర్ ని ఆసక్తికరంగా కట్ చేశారు. ఆఖరులో ‘ఇఫ్ యు ప్లే స్మార్ట్.. విత్ అవుట్ స్టుపిడ్ క్వశ్చన్స్.. యు ఆర్ అన్ స్టాబబుల్.. ‘ అంటూ రవితేజతో చెప్పించారు. 

ఇక ఖిలాడి తర్వాత త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో రవితేజ సినిమా చేయనున్నాడు. దీనికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రస్తుతం జరుగుతున్నాయి. ఇందులో కథానాయిక పాత్రకు జాత్రిరత్నాలు ఫేం ఫరియాను తీసుకున్నట్టు తెలిసింది. ఇదీగాక.. మారుతితో రవితేజ డీల్ కుదిరినట్టు సమాచారమ్.