తారక్-త్రివిక్రమ్ సినిమా క్యాన్సిల్.. కొరటాలతో #NTR30 !

తారక్ – త్రివిక్రమ్ సినిమా క్యాన్సిల్ అయింది. ఎందుకు ? అనే వివరాలేవీ తెలీదు. కానీ తారక్ న్ సినిమా క్యాన్సిల్ చేసుకున్న త్రివిక్రమ్.. మహేష్ బాబుతో సినిమా ఓకే చేసుకున్నాడు. ఇక #NTR30 కొరటాల శివ దర్శకత్వంలో ఉండనుంది. ఈరోజు సాయంత్రం దీనిపై అధికారిక ప్రకటన రానుంది.

ఇక తారక్-త్రివిక్రమ్ సినిమాకు సంబంధించి ఎన్టీఆర్ ఆర్ట్స్ కూడా చేతులు క‌లిపిన సంగతి తెలిసిందే. నంద‌మూరి క‌ల్యాణ్ రామ్ భాగ‌స్వామి. త‌న చేతుల నుంచి త్రివిక్ర‌మ్ కి  కోటి రూపాయ‌ల అడ్వాన్స్ ఇచ్చార‌ని టాక్‌. ఇప్పుడీ.. ఈ కోటి రూపాయాలకు త్రివిక్రమ్ వడ్డీతో కలిపి చెల్లించనున్నారని తెలుస్తోంది. 

ప్రస్తుతం కొరటాల శివ ఆచార్య సినిమాతో బిజీగా ఉన్నారు. ఆ తర్వాత అల్లు అర్జున్ తో కొరటాల శివ సినిమా ఉండనుంది. ఆ తర్వాత తారక్ దగ్గరకు రావాలి. అంటే.. ఆర్ ఆర్ ఆర్ తర్వాత తారక్ ఖాలీగా ఉండాల్సిన పరిస్థితి. ఈ గ్యాప్ లో తారక్ ఎవరు మీలో కోటీశ్వరులు షో ని పూర్తి చేస్తారా ? లేక మరో దర్శకుడికి గ్రీన్ సిగ్నల్ ఇస్తారా ?? అన్నది చూడాలి.