BAFTAs’లో ప్రియాంక అందాల విందు
గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా వేసిన డ్రెస్సులు, ఆమె అందం గురించి మరోసారి ప్రపంచం మాట్లాడుకుంటోంది. ఆదివారం రాత్రి జరిగిన 2021 EE British Academy Film Awards లో పింక్ కలర్ టాప్, వైట్ కలర్ పాయింట్ తో ప్రియాంక మెరిసింది. అందరి చూపులని తనవైపు తిప్పుకుంది. ఈ ఫంక్షన్ లో ప్రియాంక మొత్తం రెండు డ్రెస్సుల్లో మెరిసింది. రెండింటిలోనూ అందాల విందు చేసింది. ప్రస్తుతం ప్రియాంక పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయ్.
హాలీవుడ్ లో బిజీ అయిపోయిన ప్రియాంక బాలీవుడ్ లో సినిమాలు తగ్గించేసిన సంగతి తెలిసిందే. బాలీవుడ్ లో సినిమాలు చేస్తూ.. భర్త నిక్ తో కలిసి పార్టీలు, ఫంక్షన్స్ కి చక్కెర్లు కొడుతోంది.. గ్లోబల్ స్టార్. వాటిని చూసి బాలీవుడ్ లోని ఆమె అభిమానులు మురిసిపోతున్నారు. అయితే బాలీవుడ్ లో ప్రియాంక సినిమాలు తగ్గించేసిందే అనే బెంగ మాత్రం ఆమె అభిమానుల్లో కనిపిస్తోంది. ఇక #BAFTAs’లో ప్రియాంక అందాల విందుని మీరు ఆస్వాదించండి… !