వకీల్ సాబ్ ఓటీటీ రిలీజ్.. క్లారిటీ వచ్చేసింది !

ఈ నెలలోనే వకీల్ సాబ్ ఓటీటీ రిలీజ్. ఈ నెల 29 నుంచి అమెజాన్ ప్రైమ్ లో వకీల్ సాబ్ సందడి చేయనున్నాడనే ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ ప్రచారంపై చిత్రబృందం క్లారిటీ ఇచ్చింది. వకీల్ సాబ్ ని బిగ్ స్కీన్ పైనే చూసి ఎంజాయ్ చేయండి. ఇప్పట్లో ఓటీటీలో రిలీజ్ చేయడం లేదని క్లారిటీ ఇచ్చింది. ఈ మేరకు తెలియజేస్తూ.. ప్రత్యేక పోస్టర్ ని విడుదల చేశారు. దీంతో వకీల్ సాబ్ ఓటీటీ రిలీజ్ పై క్లారిటీ వచ్చినట్టయింది.

వాస్తవానికి వకీల్ సాబ్ బాక్సాఫీస్ దగ్గర పోటీనే లేదు. మళ్లీ కరోనా విజృంభణ నేపథ్యంలో ఈ నెల 16న రావాల్సిన సినిమాలు వాయిదా పడ్డాయ్. ఆ తర్వాత వారం కూడా సినిమాలు వచ్చే పరిస్థితులు కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో ‘వకీల్ సాబ్’దే హవా. ఒకవేళ థియేటర్స్ 50 శాతం నిబంధన మళ్లీ వచ్చినా.. వకీల్ సాబ్ కు వచ్చే ప్రమాదం ఏమీ లేదు. ఆలోగా లాభాల బాట పట్టేస్తాడు. లేటైనా వకీల్ సాబ్ డిజిటల్ రిలీజ్ కు భారీ రేటు పలకడం ఖాయం. మొత్తానికి.. వకీల్ సాబ్ సేఫ్. 

వేణు శ్రీరామ్ దర్శకత్వంలో వకీల్ సాబ్ తెరకెక్కింది. శృతిహాసన్, అంజలి, నివేదా థామస్, అనన్య తదితరులు కీలక పాత్రల్లో నటించారు. థమన్ సంగీతం అందించారు. బోనీ కపూర్ తో కలిసి దిల్ రాజు నిర్మించారు. బాలీవుడ్ హిట్ పింక్ కి రిమేక్ ఇది. ఆ ఫ్లేవర్ చెడిపోకుండా.. పవన్ ఇమేజ్ ని దృష్టిలో పెట్టుకొని స్క్రిప్ట్ లో చేసిన మార్పులు వర్కవుట్ అయ్యాయ్. పవన్ అభిమానులు సినిమాని ఎంజాయ్ చేస్తున్నారు.