ఒడిశాలో వకీల్ సాబ్’కు షాక్.. రెండు థియేటర్స్ సీజ్ !

తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాదు..  ఇతర రాష్ట్రాల్లోనూ వకీల్ సాబ్ హవా కొనసాగుతోంది.  ‘వకీల్‌సాబ్‌’ని చూసేందుకు ఒడిశాలో పవన్ అభిమానులు భారీగా స్థానిక థియేటర్లకు పోటెత్తుతున్నారు. గజపతి జిల్లా పర్లాఖెముండి పట్టణంలో రెండు థియేటర్లలో వకీల్‌సాబ్‌ విడుదలైంది. దీంతో సినిమాను చూసేందుకు ఆదివారం పవన్‌ అభిమానులు అత్యధిక సంఖ్యలో సినిమా హాళ్ల వద్దకు చేరుకున్నారు. 


ఈ క్రమంలో సినిమాహాళ్ల యాజమాన్యాలు కొవిడ్‌ నిబంధనల్ని పట్టించుకోకుండా వ్యవహరించాయని ఆరోపిస్తూ పర్లాఖెముండిలోని థియేటర్లపై జిల్లా అధికారులు చర్యలకు దిగారు. నిబంధనలు పాటించని రెండు సినిమా హాళ్లకు తాత్కాలికంగా సీల్‌ వేశారు. ఇప్పటికే ఏపీలో బెనిఫిట్ షోస్ కి అవకాశం దొరకలేదు. టికెట్ ధరలని పెంచుకోనివ్వలేదు. దీంతో ఒక్క ఏపీలోనే వకీల్ సాబ్ కు రూ. 50కోట్ల నష్టమని ట్రేడ్ వర్గాలు తేలుస్తున్నాయి. ఇలాంటి టైమ్ లో ఇతర రాష్ట్రాల్లోనూ.. వకీల్ సాబ్ కలెక్షన్స్ కి బ్రేక్ పడుతోంది.