దేశంలో 2 లక్షలు దాటిన కొత్త కేసులు
దేశంలో కరోనా తీవ్ర రూపం దాల్చుతోంది. గడిచిన 24 గంటల్లో దేశంలో 2,00,739 కొత్త కేసులు నమోదయ్యాయ్. మరో 1,038 మంది కరోనాతో మృతి చెందారు. దీంతో మొత్తం కరోనా కేసులు 1,40,74,564కు చేరాయి. మృతుల సంఖ్య 1,73,123కి చేరాయి. గడిచిన 24 గంటల్లో 93,528 మంది కరోనా నుంచి కోలుకోని డిశ్చార్జ్ అయ్యారు. దీంతో ఇప్పటి వరకు కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 1,24,29,564కి చేరాయి. ప్రస్తుతం దేశంలో 14,71,877 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
మరోవైపు కరోనా కట్టడి కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన ఆంక్షలు విధిస్తున్నాయి. ఇప్పటికే మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఢిల్లీ ప్రభుత్వాలు నైట్ కర్ఫ్యూలని ఆశ్రయించాయి. వీకెండ్ లాక్ డౌన్ లని పాటిస్తున్నాయి. ఇక ఈరోజు ఢిల్లీ సీఎం అరవింద్ క్రేజీవాల్ కరోనా వ్యాప్తి సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. ఇందులో కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్టు సమాచారమ్.
ఇక తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 3,307 కొత్త కేసులు నమోదయ్యాయ్. మరో 3 కరోనాతో మృతి చెందారు. దీంతో మొత్తం కరోనా మృతుల సంఖ్య 1788కి చేరాయి. నిన్న ఒక్కరోజే 897 మంది కరోనా నుంచి కోలుకున్నారు.