హిందీ ‘అపరిచితుడు’.. ఓ సమస్య !

గ్రేట్ దర్శకుడు శంకర్ కు ఈ మధ్య బ్యాడ్ టైమ్ నడుస్తోంది. భారతీయుడు 2 మధ్యలోనే ఆగిపోయింది. రామ్ చరణ్ తో సినిమా ఎనౌన్స్ చేస్తే.. దానిపై వివాదం తలెత్తింది. ఇండియన్-2 పూర్తి చేయకముందు మరో సినిమా స్టార్ట్ చేస్తారని నిర్మాతలు నిలదీశారు. ఈ వివాదాన్ని తెరవెనక పరిష్కరించుకున్నారు శంకర్.

 
ఇప్పుడు దాదాపు ఇలాంటి సమస్తే హిందీ అపరిచితుడు విషయంలో తలెత్తింది. రణ్వీర్ సింగ్ తో హిందీ అపరిచితుడు ప్రాజెక్టు ఎనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. దీనిపై అపరిచితుడు నిర్మాత ఆస్కార్ రవిచంద్రన్ ఫైర్ అయ్యాడు. శంకర్ కు ఓపెన్ లెటర్ రాశాడు. అపరిచితుడు రైట్స్ అన్నీ తన దగ్గర ఉన్నాయని, అలాంటప్పుడు తనను సంప్రదించకుండా మరో నిర్మాతతో రణ్వీర్ సింగ్ తో దాని రీమేక్ ఎలా తీస్తావంటూ సూటిగా ప్రశ్నించాడు రవిచంద్రన్. దీనిపై శంకర్ ఏ సమాధానం ఇస్తారు ?.. ఈ వివాదాన్ని ఎలా పరిష్కరించుకుంటారు ?? అన్నది చూడాలి.