మహా సర్కార్ కీలక నిర్ణయం… కోవిడ్ హాస్పాల్స్’గా 5స్టార్ హోటల్స్ !
మహారాష్ట్రలో కరోనా విజృంభణ తీవ్ర స్థాయిలో కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దేశ వాణిజ్య రాజధాని ముంబయి కీలక నిర్ణయం తీసుకుంది. ఫైవ్‌స్టార్ హోటళ్లను కొవిడ్ ఆసుపత్రులుగా మార్చేందుకు రంగం సద్ధం చేసింది. స్వల్ప లక్షణాలతో బాధపడుతున్న కరోనా రోగులకు చికిత్స అందించేందుకు ముంబయి ఆసుపత్రులు ఐదు నక్షత్రాల హోటళ్లను ఉపయోగించుకోనున్నట్లు నగర వైద్యారోగ్య యంత్రాంగం గురువారం ప్రకటించింది.
ప్రైవేటు ఆసుపత్రుల్లో చేరుతున్న కరోనా రోగుల్లో చాలా మందికి అత్యవసర వైద్య చికిత్స అవసరం ఉండట్లేదు. కానీ, వారిని కూడా ఆసుపత్రుల పర్యవేక్షణలో ఉంచడం వల్ల ఎమర్జెన్సీ రోగులకు పడకలు దొరకట్లేదు. అందువల్ల ప్రైవేటు ఆసుపత్రులు ఫోర్ స్టార్, ఫైవ్ స్టార్ హోటళ్లతో ఒప్పందం కుదుర్చుకుని వాటిని తాత్కాలిక ఆసుపత్రులుగా మార్చనున్నాయి. స్వల్ప లక్షణాలు ఉన్నవారు, క్రిటికల్ కేర్ యూనిట్లు అవసరం లేని రోగులను ఆ హోటళ్లకు తరలిస్తే అత్యవసరంలో ఉన్న కరోనా రోగులకు ఐసీయూల్లో చికిత్స అందించడం వీలవుతుందని ఆరోగ్యశాఖ వెల్లడించింది.