సమ్మర్ గోవిందా.. !

గత యేడాది కరోనా లాక్ డౌన్ మార్చి ఆఖరి వారం నుంచి థియేటర్స్ మూతపడ్డాయ్. దాదాపు ఆర్నెళ్ల తర్వాత థియేటర్స్ తెరచుకున్నాయ్. దీంతో గత యేడాది సమ్మర్ పోయింది. ఇక ఈ యేడాది కూడా సేమ్ సీన్. కరోనా సెకండ్ వేవ్ మొదలుకావడంతో.. మళ్లీ సినిమాలు వాయిదాల బాట పట్టాయి. ఈ నెల 16న రావాల్సిన లవ్ స్టోరీ వాయిదా పడింది. 23న రావాల్సిన నాని ‘టక్ జగదీష్’ ఆ దారిలోనే వెళ్లింది. 


ఆ తరువాత వారం రావాల్సిన పాగల్, విరాటపర్వం సినిమాలు కూడా డిటో..డిటో అయ్యాయి. ఆ విధంగా ఏప్రిల్ నెల ఎగిరిపోయింది. ఇక మే నెలలో పెద్ద సినిమా అనుకున్న ఆచార్య కూడా వాయిదా పడుతుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఆగస్టు 13 న రావాల్సిన పుష్ప వాయిదాపై ఇంకా క్లారిటీ లేదు. అప్పటి పరిస్థితులని బట్టీ నిర్ణయం తీసుకొనే అవకాశాలున్నాయి.  మే నెలలో రావాల్సిన అఖండ కూడా ఆలస్యం అయ్యేలా ఉందని సమాచారమ్. మొత్తానికి.. టాలీవుడ్ కి సమ్మర్ పోయినట్టే.