పవన్’కు కరోనా పాజిటివ్.. ఆందోళనలో అభిమానులు !

వకీల్ సాబ్ హిట్ కిక్కులో ఉన్న పవర్ స్టార్ పవన్ అభిమానులకి బ్యాడ్ న్యూస్. తాజాగా పవన్ కు కరోనా పాజిటివ్ గా నిర్థారణ అయింది. ఇటీవలే పవన్ హోం క్వారంటైన్ లోకి వెళ్లిన సంగతి తెలిసిందే. ఆయన వ్యక్తిగత సిబ్బంది, భద్రతా సిబ్బందికి కరోనా పాజిటివ్ గా రావడంతో.. డాక్టర్ సూచన మేరకు పవన్ క్వారంటైన్ లోకి వెళ్లినట్టు జనసేన పార్టీ ఓ ప్రకటనలో తెలిపింది. అప్పటి నుంచి పవన్ వ్యవసాయ క్షేత్రంలో క్వారంటైన్‌లో ఉన్నారు.
తాజాగా కొద్ది పాటి జ్వరం, ఒళ్లు నొప్పులు ఇబ్బంది పెడుతుండటంతో మరోసారి కరోనా పరీక్షలు చేయించుకోవడంతో ఫలితం పాజిటివ్ అని వచ్చింది. ప్రముఖ కార్డియాలజిస్టు డాక్టర్ తంగెళ్ల సుమన్ ఆధ్వర్యంలో పవన్‌కు చికిత్స అందిస్తున్నారు. పవన్ కు కరోనా పాజిటివ్ అని తెలిసి ఆయన అభిమానులు ఆందోళన చెందుతున్నారు. పవన్ బెడ్ ఉన్న ఫోటో ఒకటి బయటికొచ్చింది. దాన్ని చూసి పవన్ అభిమానులు, జనసేన శ్రేణులు తీవ్రంగా కలత చెందుతున్నారు. పవన్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు.