చండీగఢ్‌లో వారాంతపు లాక్‌డౌన్

దేశంలో కరోనా సెకండ్ వేవ్ మొదలైంది. దీంతో కరోనా కేసులు అనూహ్యంగా పెరుగుతున్నాయి. వరుసగా రెండోరోజు దేశంలో 2లక్షలకు పైగా కొత్త కేసులు నమోదయ్యాయ్. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వాలు ఆంక్షలు విధిస్తున్నాయి. ఇప్పటికే మహారాష్ట్ర, ఉత్తరప్రదేష్, ఢిల్లీ తదితర ప్రభుత్వాలు వారంతరపు లాక్‌డౌన్, నైట్ కర్ఫ్యూలని విధిస్తున్న సంగతి తెలిసిందే.

తాజాగా కేంద్రపాలిత ప్రాంతం చండీగఢ్‌లోవారాంతపు లాక్‌డౌన్ విధించారు. నేటి రాత్రి 10 గంటల నుంచి సోమవారం ఉఅర్దయం 5 గంటల వరకు లాక్‌డౌన్‌ విధిస్తున్నట్లు అక్కడి ప్రభుత్వం స్పష్టం చేశారు. అత్యవసర సేవలు మాత్రమే అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు.

మరోవైపు దేశంలో మరోసారి లాక్‌డౌన్ ఉండదని ప్రధాని నరేంద్ర మోడీ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. అయితే పూర్తిస్థాయి లాక్‌డౌన్ విధించకున్నా.. వారంతరపు లాక్‌డౌన్, నైట్ కర్ఫ్యూ లాంటివి విధించాలనే డిమాండ్స్ ప్రజల నుంచి వినబడుతున్నాయి. ఇదేగాక.. థియేటర్లు, క్లబ్ లు, బార్లపై కూడా ఆంక్షలు విధించాలని కోరుతున్నారు.