TSలో కరోనా ఉగ్రరూపం : 4,446 కేసులు.. 12 మరణాలు !

తెలంగాణ కరోనా మహమ్మారి తీవ్రరూపం దాల్చుతోంది. నిన్న 3వేలకుపైగా నమోదైన కేసులు.. ఇవాళ 4వేలు దాడిపోయాయ్. గడిచిన 24 గంటల్లో తెలంగాణలో 4,446 క‌రోనా కొత్త కేసులు న‌మోదయ్యాయ్. మరో 12 కరోనా మృతి చెందారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య‌ 3.46 ల‌క్ష‌ల‌కు చేరింది. మరణాల సంఖ్య 1,809కి చేరాయి.

నిన్న1,414 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు కరోనా నుంచి పూర్తిగా కోలుకొని డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య  3.11 లక్ష‌లకు చేరుకుండ్. ప్రస్తుతం రాష్ట్రంలో 33,514 యాక్టివ్ కేసులున్నాయి. ఇందులో 22,118 మంది బాధితులు హోం ఐసోలేష‌న్‌లో ఉన్నారు.

మరోవైపు కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనుంది. హైదరాబాద్ లో లాక్ డౌన్ ప్రకటించే ఆలోచన చేస్తోంది. ఓ 15 రోజుల పాటు లాక్ డౌన్ విధించే ఆస్కారం ఉందనే ప్రచారం జరుగుతోంది. అయితే ఇప్పటికే సీఎం కేసీఆర్, మంత్రి ఈటెల రాజేందర్ తెలంగాణలో ఎలాంటి లాక్ డౌన్, నైట్ కర్ఫ్యూ ఉండదని స్పష్టం చేసిన విషయం తెలిసిందే. అయితే పరిస్థితి చేయిదాటే పరిస్థితులు వస్తే మాత్రం లాక్ డౌన్ లేదా కఠిన ఆంక్షలు తప్పకపోవచ్చని తెలుస్తోంది.