TSలో 5వేల కేసులు.. 15 మరణాలు !

తెలంగాణలో కరోణా విజృంభణ కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో తెలంగాణలో కొత్తగా 5,093 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. నిన్న కరోనాతో 15 మంది మరణించారు. దీంతో కరోనాతో ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 1,824కి చేరింది. కరోనా బారి నుంచి నిన్న 1,555 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు కోలుకున్న వారి సంఖ్య 3,12,563కి చేరింది. ప్రస్తుతం 37,037 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని, వారిలో 24,156 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారు. నిన్న జీహెచ్‌ఎంసీ పరిధిలో 743 కేసులు నమోదయ్యాయి.

ఇక దేశంలో గడిచిన 24 గంటల్లో దేశంలో 2,61,500 కేసులు నమోదయ్యాయ్. మరో 1,501 మంది కరోనాకు బలయ్యారు. నిన్న ఒక్కరోజే మహారాష్ట్రలో 67,123 కేసులు నమోదు కాగా.. 419 మంది కరోనా బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. ఇక దిల్లీలో 24,375 కేసులు నమోదు కాగా, 167 మంది మృతి చెందారు. కేసులు పెరుగుతున్న తరుణంలో పలు రాష్ట్రాలు ఆక్సిజన్‌ సిలిండర్ల సరఫరాను పెంచాలని కేంద్రాన్ని కోరాయి. దీనిపై ఆరోగ్య మంత్రి హర్షవర్దన్‌ స్పందించారు. అన్నీ రాష్ట్రాలకు ఆక్సిజన్ సిలిండర్స్ పంపిస్తామని తెలిపారు.