మరో ఇద్దరు సినీ స్టార్స్ కి కరోనా పాజిటివ్
దేశంలో కరోనా తీవ్రరూపం దాల్చుతోంది. సామాన్యులు, సెలబ్రెటీలు కరోనా బారినపడుతున్నారు. ఇప్పటికే పరేశ్ రావల్, ఆమిర్‌ఖాన్, కార్తిక్ ఆర్యన్, మాధవన్, రణ్‌బీర్ కపూర్, ఆలియాభట్, భూమి ఫెడ్నేకర్, అక్షయ్‌కుమార్, విక్కీ కౌశల్, కత్రినా కైఫ్, నివేదా థామస్, దిల్‌రాజు, పవన్‌కల్యాణ్, బండ్ల గణేశ్, సోనూసూద్ తదితరులు కొవిడ్ బారిన పడ్డారు. తాజాగా మరో ఇద్దరు సినీ తారలకు కొవిడ్ సోకింది.
తమకి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యిందని తెలియజేస్తూ కోలీవుడ్ నటుడు ఆధర్వ, నటి సమీరా రెడ్డి సోషల్‌మీడియాలో పోస్టులు పెట్టారు. కొవిడ్ లక్షణాలు స్వల్పంగా కనిపించడంతో వెంటనే వైద్యుల్ని సంప్రదించి పరీక్షలు చేయించుకున్నాను.కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. వైద్యులు సూచన మేరకు తగిన జాగ్రత్తలు పాటిస్తూ ఇంట్లోనే స్వీయ నిర్బంధంలో ఉన్నానని అధర్వ ట్విట్ చేశారు.
‘శనివారం నాకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. మేము ఆరోగ్యంగానే ఉన్నాం. దేవుడి దయ వల్ల అత్తయ్యకు నెగెటివ్ వచ్చింది. ప్రస్తుతానికి మేము ఇంట్లోనే ఉంటూ తగిన చికిత్స పొందుతున్నాం. మరింత ధైర్యంగా ఉండాల్సిన సమయమిది. మీరు కూడా జాగ్రత్తగా ఉండండి’ అని సమీరా రెడ్డి ట్విట్ చేశారు.