3డి ప్లేయర్’ని టార్గెట్ చేసిన నెటిజన్స్
3డి ప్లేయర్ ఉంటే.. ఆ జట్టుకు మరింత బలం కావాలి. కానీ అతడే ఆ జట్టుకు బలహీనతగా మారకూడదు. ఐతే 3డి ప్లేయర్ గా గుర్తింపు తెచ్చుకున్న విజయ్ శంకర్ మాత్రం సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు భారంగానే మారాడు. తాజా ఐపీఎల్ లో మొదటి రెండు మ్యాచ్ లలో విజయ్ శంకర్ గొప్పగా ఏమీ రాణించలేదు. బ్యాటింగ్, బౌలింగ్ లోనూ విఫలమయ్యాడు. ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. ఫీల్డింగ్ లోనూ మెరుపుల్లేవ్. దీంతో అతడిపై ట్రోల్స్ మొదలయ్యాయ్. 3డి ప్లేయర్ వద్దంటూ నెటిజన్స్.. ఓ రేంజ్ లో వేసుకున్నారు.
అయితే అవేవీ పట్టించుకోకుండా నిన్న ముంబైతో జరిగిన మ్యాచ్ లో విజయ్ శంకర్ ని ఆడించారు. బహుశా.. తనపై వస్తున్న విమర్శలకు సమాధానం చెప్పాలనే కసితో కాబోలు.. నిన్నటి మ్యాచ్ లో విజయ్ శంకర్ మెరిశాడు. రెండు కీలక వికెట్లు తీశాడు. బ్యాటింగ్ లోనూ మెరుపులు మెరిపించే ప్రయత్నం చేశారు. 28 (25 బంతుల్లో) పరుగులు చేశాడు.
ఇందులో రెండు సిక్సర్స్ కూడా ఉన్నాయి. ఐతే జట్టుని విజయాన్ని అందించలేక పోయాడు. ఓ భారీ షాట్ కి ప్రయత్నించి అవుటయ్యాడు. దీంతో.. వచ్చే మ్యాచ్ లో ఆడగలిగే తనకు ఉందని నిరూపించుకొనే ప్రయత్నం చేశాడు.. ఈ 3డి ప్లేయర్. అయితే బ్యాటింగ్ లో భారీ మార్పులు చేయాలని భావిస్తున్న సన్ రైజర్స్ వచ్చే మ్యాచ్ లో విజయ్ కి అవకాశం ఇస్తుందా ? అన్నది చూడాలి.
నిన్నటి మ్యాచ్ లో మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ముంబయి నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 150 పరుగులు చేయగా, హైదరాబాద్ ఛేదనలో 19.4 ఓవర్లలో 137 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్లు జానీ బెయిర్‌స్టో(43; 22 బంతుల్లో 3×4, 4×6), డేవిడ్ వార్నర్(36; 34 బంతుల్లో 2×4, 2×6) రాణించారు. మిగితా ఆటగాళ్లు పెలివియన్ కు క్యూ కట్టడంతో సన్ రైజర్స్ 13 పరుగుల తేడాతో ఓటమిపాలైంది.