షర్మిలని ఆహ్వానించిన అమరావతి రైతులు

వైఎస్ షర్మిల తెలంగాణలో రాజకీయాలు మొదలెట్టిన సంగతి తెలిసిందే. తెలంగాణలో రాజన్న రాజ్యం తెస్తానని.. ఇక్కడ కొత్త పెట్టేందుకు రెడీ అయింది. జులై 8న రాజకీయ పార్టీని ప్రకటించనుంది. అంతకంటే ముందే.. తెలంగాణలోని నిరుద్యోగుల సమస్యలని ఎత్తుకుంది. నిరుద్యోగుల సమస్యలని తీర్చాలి.. ఖాళీగా ఉద్యోగాలకు వెంటనే నోటిఫికేషన్స్ వేయాలని మూడ్రోజుల నిరాహార దీక్ష కూడా చేసింది. ఇక నిన్న నిరాహార దీక్షని విరమించిన షర్మిల రాబోయే రెండేళ్లలో తెలంగాణలో తమ పార్టీ అధికారంలోకి వస్తుందని ప్రకటించింది.

షర్మిల తెగువ, పోరాటానికి తెలంగాణ ప్రజలు ఫిదా అయ్యారో.. లేదో.. తెలియదు. కానీ ఏపీ ప్రజలు మాత్రం షర్మిల శభాష్ అంటున్నారు. ముఖ్యంగా అమరావతి రైతులు షర్మిల వైపు ఆకర్షితులయ్యారు. తమ సమస్యలని కూడా మీరే తీర్చాలని.. ఆమెని అమరావతికి ఆహ్వానిస్తున్నారు. తమ ఆవేదన వినాలని షర్మిలకు అమరావతి మహిళా రైతులు ప్రత్యేకంగా వీడియో విడుదల చేశారు. తమకు అపాయింట్‌మెంట్ ఇవ్వాలని.. తమకు మద్దతుగా ఏపీలోనూ పోరాడాలని కోరుతున్నారు.

మరీ.. వారి విజ్ఝప్తులపై షర్మిల స్పందిస్తారా ? లేక ఏపీ రాజకీయాలతో తనకు సంబంధం లేదు. అక్కడ జగనన్న ఉన్నారు. తాను కేవలం తెలంగాణలో మాత్రమే పోరాటం చేస్తా. తనకు అమరావతి రైతుల సమస్యలకు సంబంధం ఏంటీ  అంటారా ?? అన్నది చూడాలి. మొత్తానికి.. అమరావతి రైతుల ఆహ్వానాలు షర్మిలని ఇరుకున పెట్టే విషయమే. ఈ ఆహ్వానాలపై షర్మిల మౌనమే అస్త్రంగా మార్చుకుంటుందేమో.. !