అవినీతి నిరోధనకు.. జగన్ మాస్టర్ ప్లాన్ !
అవినీతి తగ్గించేందుకు ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అవినీతి నిరోధక శాఖ రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న కేసుల్లో వంద రోజుల్లో క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. పక్కా ఆధారాలతో దొరికిన వారిపై వంద రోజుల్లో చర్యలు తీసుకోవాలని.. ఒక వేళ తీసుకోకపోతే.. ఆలస్యానికి కారణమైన వారిపై చర్యలు ఉంటాయని ప్రభుత్వం స్పష్టం చేసింది.
ఇప్పటికే ఏపీ ప్రభుత్వం ప్రత్యేకంగా కాల్ సెంటర్ ఏర్పాటు చేసింది. లంచాలు అడుగుతున్న వారి సమాచారాన్ని ఇస్తే.. ఏసీబీ అధికారులు రెయిడ్ చేస్తున్నారు. కేసులు బుక్ చేస్తున్నారు.అయితే ఇలాంటి కేసుల్లో పట్టుబడిన వారికి శిక్షలు పడటం లేడు. దీంతో ఏసీబీ రెయిడ్స్ పై భయం తగ్గుతోంది. ఈ పరిస్థితిని గమనించిన ఏపీ ప్రభుత్వం.. దొరికిన వారికి కఠిన శిక్షలు పడేందుకు వందరోజుల్లో క్రమశిక్షణ రూల్ ని తీసుకొచ్చింది. ఇలాంటి రూల్ తెలంగాణలోనూ తీసుకొస్తే.. ఓటుకు నోటు కేసులోని నిధులు ఇప్పటికే కటకటాల వెనక ఉండేవారేమో.. !