దేశంలో 3లక్షలు, తెలంగాణలో 4వేల కరోనా కేసులు
దేశంలో కరోనా సెకండ్ వేవ్ తీవ్రరూపం దాల్చుతోంది. రోజువారీగా నమోదవుతున్న కొత్త కేసుల సంఖ్య 3లక్షలకు చేరువయ్యాయ్. గడిచిన 24 గంటల్లో దేశంలో 2,73,810 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,50,61,919కి చేరింది. నిన్న 1,619మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఇప్పటి వరకు దేశంలో కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య 1,78,769కి చేరింది. ఇక మరణాల రేటు 1.20 శాతానికి చేరింది. నిన్న 1,44,178మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. దీంతో మొత్తం రికవరీల సంఖ్య 1,29,53,821కు చేరి.. రికవరీ రేటు 86.62శాతానికి తగ్గింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా క్రియాశీల కేసుల సంఖ్య 19,29,329 కి పెరిగింది.
తెలంగాణలోనూ కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో తెలంగాణలో 4,009 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 3,55,433కి చేరింది. నిన్న కరోనాతో 14 మంది మరణించారు. దీంతో కరోనాతో ఇప్పటి వరకు మృతిచెందిన వారి సంఖ్య 1,838కి చేరింది. కరోనా బారి నుంచి నిన్న 1,878 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు కోలుకున్న వారి సంఖ్య 3,14,441కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 39,154 యాక్టివ్ కేసులు ఉన్నాయి.