6రోజుల పాటు ఢిల్లీ లాక్ డౌన్

దేశంలో కరోనా సెకండ్ వేవ్ తీవ్రరూపం దాల్చిన నేపథ్యంలో ఢిల్లీ సీఎం అరవింద్ క్రేజీవాల్ కీలక నిర్ణయం తీసుకునారు. ఢిల్లీలో లాక్ డౌన్ మినహా మరో మార్గం లేదని తేల్చేశారు. వారం పాటు లాక్ డౌన్ ప్రకటించారు. ప్రజలు అందరూ సహకరించాలని.. అత్యవసర సేవలకు మాత్రమే మినహాయింపు ఇస్తున్నట్లుగా ప్రకటించారు. వలస కార్మికులు ఎక్కడకూ పోవద్దని వారికి కావాల్సిన సౌకర్యాలు కల్పిస్తామని కేజ్రీవాల్ హామీ ఇచ్చారు.

మరోవైపు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా కరోనా వైరస్‌ కట్టడి, వ్యాక్సినేషన్‌ ప్రక్రియ వేగవంతంపై ఆయన అధికారులతో చర్చిస్తున్నారు. ఐతే ప్రధాని లాక్ డౌన్ లాంటి ఆలోచనలు చేయకపోవచ్చు. కానీ.. నైట్ కర్ఫ్యూ, వారాంతరపు లాక్ డౌన్ లాంటి నిర్ణయాలు తీసుకుకొనే అవకాశాలున్నాయని చెబుతున్నారు. గడిచిన 24 గంటల్లోనే రికార్డు స్థాయిలో దేశంలో 2లక్షల 73వేల కేసులు వెలుగుచూశాయి. ఈ నేపథ్యంలో ప్రధాని సమీక్ష ప్రాధాన్యతని సంతరించుకుంది.