వింత : నదిలో పాల ప్రవాహం

ఉన్నట్టుండి ఆ నదిలో పాల ప్రవాహం మొదలైంది. యూకేలోని వేల్స్ నగరంలో ఈ ఘటన జరిగింది.అక్కడున్న దులైస్ నదిలో అకస్మాత్తుగా ఏప్రిల్ 14 నుంచి పాల ప్రవాహం మొదలైంది. ఇలాంటి ఘటన మన భారతదేశంలో జరిగితే.. అద్భుతం అనేవారు. ఇది కచ్చితంగా దేవుడి మహిమ అంటూ.. పూజాలు చేసేవారు. ఈ ఘటనని కమర్షియల్ గా మార్చి క్యాష్ చేసుకొనేవారు. ఇంతకీ దులైస్ నదిలో పాల ప్రవాహానికి కారణం ఏంటో తెలుసా ? 

దులైస్ నదికి సమీపంలో ఓ భారీ పాల ట్యాంకర్ బోల్తా పడి అందులోని 28 వేల లీటర్ల పాలు వరదలా పోటెత్తి నదిలోకి ప్రవహించాయి. దీంతో.. దులైస్ నది క్షీర ప్రవాహాన్ని తలపించింది. ఆ నది పాలాభిషేకాన్ని చేసుకొంది అన్నమాట. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఈ ఘటన వెనక నిజం తెలియని ప్రజలు అద్భుతం అంటున్నారు. నిజం తెలిసిన జనాలు మాత్రం.. సిల్లీ అనేస్తున్నారు. మరీ.. ఈ వీడియోని చూసి మీరేంటారు ?

When a milk tanker overturns in the river #llanwrda #wales #milk pic.twitter.com/vnyhr5FXBi— May 🏴󠁧󠁢󠁷󠁬󠁳󠁿 (@MayLewis19) April 14, 2021