గుడ్ న్యూస్ : దేశంలో స్వల్పంగా తగ్గిన కరోనా కేసులు
దేశంలో కరోనా సెకండ్ వేవ్ తీవ్రరూపం దాల్చుతున్న సంగతి తెలిసిందే. రోజువారీగా నమోదవుతున్న కొత్త కేసులు, మరణాల సంఖ్యలో భారీగా పెరుగుదల కనిపిస్తోంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్, నైట్ కర్ఫ్యూలని ఆశ్రయిస్తున్నాయి. ఇది తప్ప మరో మార్గం లేదని తేల్చి చెబుతున్నాయి.
ఇక గడిచిన 24 గంటల్లో దేశంలో 2,59,170 కరోనా కొత్త కేసులు నమోదయ్యాయ్. ఐతే క్రితంరోజు నమోదైన 2.73లక్షల కేసులతో పోలిస్తే.. కాస్త తగ్గుదల కనిపించింది. ఇక దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,53,21,089కి చేరింది. నిన్న 1761 మంది కరోనాతో కన్నుమూశారు. దీంతో మొత్తం కరోనా మరణాల సంఖ్య 1,80,530కి చేరింది. మరణాల రేటు 1.18శాతానికి చేరింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 20,31,977 క్రియాశీల కేసులుండగా.. ఆ రేటు 13.26శాతానికి పెరిగింది. నిన్న 1,54,761 మంది కొవిడ్ నుంచి కోలుకున్నారు.