ఝార్ఖండ్ లాక్‌డౌన్
దేశంలో కరోనా సెకండ్ వేవ్ ఉదృతి కొనసాగుతోంది. ఐతే మరోసారి దేశంలోలాక్‌డౌన్ విధించే ఆలోచనలో కేంద్ర ప్రభుత్వం లేదు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వాలే లాక్‌డౌన్, నైట్ కర్ఫ్యూలని ఆశ్రయిస్తున్నాయి. ఇప్పటికే మహారాష్ట్ర, ఢిల్లీ రాష్ట్రాలు లాక్‌డౌన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా ఝార్ఖండ్ కూడా లాక్‌డౌన్ ని ఆశ్రయించింది.
రాష్ట్రవ్యాప్తంగా ఈనెల 22 నుంచి 29 వరకు వారం రోజులపాటు లాక్‌డౌన్ విధించింది. అత్యవసర సేవలకు మినహాయింపు ఇస్తున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. మరికొన్ని రాష్ట్రాలు రాత్రి కర్ఫ్యూ, Weekend Lockdown అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. వాటి వల్ల కూడా కరోనా కట్టడి సాధ్యంకాకపోతే.. ఆయా రాష్ట్రాలు కూడా లాక్‌డౌన్ కు వెళ్లక తప్పని పరిస్థితులు కనబడుతున్నాయి.