రాహుల్ త్వరగా కోలుకోవాలి : మోడీ
దేశంలో కరోనా సెకండ్ వేవ్ ఉదృతి కొనసాగుతోంది. సామాన్యులే కాదు. సినీ, రాజకీయ, వ్యాపార, క్రీడా ప్రముఖులు కరోనా బారినపడుతున్నారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కూడా కరోనా బారినపడిన సంగతి తెలిసిందే. ఆయన త్వరగా కోలుకోవాలని కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు ఆకాంక్షిస్తూ.. సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. తాజాగా ప్రధాని నరేంద్ర మోడీ కూడా గాంధీకి కరోనా సోకడంపై స్పందించారు. రాహుల్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ‘లోక్‌సభ ఎంపీ రాహుల్ గాంధీ త్వరగా కోలుకోవాలని, ఆరోగ్యంతో ఉండాలని ప్రార్థిస్తున్నా’ అంటూ ప్రధాని ట్విట్ చేశారు.
I pray for the good health and quick recovery of Lok Sabha MP Shri @RahulGandhi Ji.— Narendra Modi (@narendramodi) April 20, 2021
ఇక స్వల్ప లక్షణాలు కనిపించడంతో కొవిడ్ పరీక్ష చేయించుకోగా.. పాజిటివ్ తేలినట్లు రాహుల్ గాంధీ స్వయంగా వెల్లడించిన విషయం తెలిసిందే. ఇటీవల తనతో సన్నిహితంగా ఉన్నవారంతా కరోనా పరీక్ష చేయించుకోవాలని ఆయన ట్విటర్‌లో సూచించారు. ఇటీవల దేశంలో పలువురు కీలకనేతలకు కొవిడ్ సోకుతున్న విషయం తెలిసిందే. దక్షిణాదిన ఏపీ సీఎం జగన్ మినహా అన్నీ రాష్ట్రాల సీఎంలు కరోనా బారినపడ్డారు. వీళ్లంతా ఇటీవల ఎన్నికల ప్రచారంలో పాల్గొనడమే ఇందుకు కారణమని తెలుస్తోంది.
After experiencing mild symptoms, I’ve just tested positive for COVID.
All those who’ve been in contact with me recently, please follow all safety protocols and stay safe.— Rahul Gandhi (@RahulGandhi) April 20, 2021