సౌత్ సీఎం’లలో జగన్ మాత్రమే సేఫ్.. ఎందుకంటే ?

దేశంలో కరోనా విశ్వరూపం చూపిస్తోంది. సెకండ్ వేవ్ లో కరోనా కేసులు, మరణాల సంఖ్య భారీగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్, నైట్ కర్ఫ్యూలని ఆశ్రయిస్తున్నాయి. తాజాగా తెలంగాణ ప్రభుత్వం నేటి నుంచి మే 1వ తేది వరకు నైట్ కర్ఫ్యూ విధిస్తున్నట్టు ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని కాసేపు పక్కనపెడితే.. సౌత్ సీఎం’లలో ఏపీ సీఎం జగన్ మాత్రమే సేఫ్ గా ఉన్నారు. మిగితా సీఎంలు అందరూ కరోనా బారినపడిన సంగతి తెలిసిందే.

త‌మిళ‌నాడు సీఎం ప‌ళ‌నిస్వామి, కేర‌ళ సీఎం పిన‌ర‌యి విజ‌య‌న్, క‌ర్ణాట‌క సీఎం య‌డ్యూర‌ప్ప, తెలంగాణ సీఎం కేసీఆర్ కరోనా బారినపడ్డారు. వీరంతా కూడా ఇటీవల ఎన్నిక‌ల ప్ర‌చారంలో పాల్గొన్న వారే. అయితే ఏపీ సీఎం జగన్ మాత్రం కాస్త తెలివిగా వ్యవహరించినట్టు కనిపిస్తోంది. జగన్ కూడా తిరుపతి ఉప ఎన్నిక ప్రచారంలో పాల్గొనాలి. కానీ ఆ ఎన్నికల బహిరంగ సభని జగన్ క్యాన్సిల్ చేసుకున్నారు. తద్వారా ఆయన కరోనా బారినపడిన పడకుండా తప్పించుకున్నట్టయిందని చెప్పుకుంటున్నారు.