TSలో మొన్న 3.. నిన్న4.. ఇవాళ 6వేల కేసులు !
తెలంగాణలో కరోనా విశ్వరూపం చూపిస్తోంది. మొన్న 3వేల కొత్త కేసులు నమోదుకాగా.. నిన్న ఆ సంఖ్య 4వేలని దాటిపోయింది. ఇక ఈరోజు ఆ సంఖ్య 6వేలకు చేరువైంది. గడిచిన 24 గంటల్లో తెలంగాణలో 5,926 కొత్త కేసులు నమోదయ్యాయ్. దీంతో మొత్తం ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 3,61,359కి చేరింది. ]
నిన్న కరోనాతో 18 మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,856కి చేరింది. కరోనా బారి నుంచి నిన్న ఒక్క రోజే 2,209 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకు కోలుకున్న బాధితుల సంఖ్య 3,16,656కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 42,853 యాక్టివ్ కేసులు ఉన్నాయి. నిన్న జీహెచ్ఎంసీ పరిధిలో 793 కేసులు నమోదయ్యాయి.
ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా కరోనా బారినపడిన సంగతి తెలిసిందే. ఆయన త్వరగా కోలుకోవాలని సినీ, రాజకీయ, వ్యాపార ప్రముఖులు, పార్టీ శ్రేణులు, ప్రజలు ఆకాంక్షిస్తూ.. పోస్టులు పెడుతున్నారు. మరోవైపు కరోనా కట్టడిపై ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడం హైకోర్ట్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. 48 గంటల్లో లాక్ డౌన్ లేదా నైట్ కర్ఫ్యూపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది. లేని యెడల ఆ పని తామే చేస్తామని కోర్టు కామెంట్ చేసింది.