కొవిషీల్డ్ టీకా రేటుని ప్రకటించిన సీరమ్

సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా.. ప్రైవేటు మార్కెట్లో కొవిషీల్డ్ టీకాల ధరలను ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వాలకు ఒక డోసుకు రూ. 400, ప్రైవేటు ఆసుపత్రులకు రూ. 600 చొప్పున టీకాను విక్రయిస్తామని వెల్లడించింది.
“కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు మా ఉత్పత్తిలో 50శాతం కేంద్రానికి, 50శాతం రాష్ట్రాలు, ప్రైవేటు ఆసుపత్రులకు అందజేయనున్నాం. రాష్ట్ర ప్రభుత్వాలకు ఒక డోసుకు రూ. 400, ప్రైవేటు ఆసుపత్రులకు రూ. 600 చొప్పున విక్రయిస్తాం. విదేశీ టీకాలతో పోలిస్తే మా వ్యాక్సిన్ ధరలు అందుబాటులోనే ఉన్నాయి” అని సీరమ్ సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది.