భారత్’కు చేరుకున్న మరో 4 రాఫెల్ యుద్ధ విమానాలు


36 రాఫెల్‌ జెట్లను కొనుగోలు చేసుకునేందుకు భారత్‌ 2016 సెప్టెంబర్‌లో ఫ్రాన్స్‌తో ఒప్పందం చేసుకున్న విషయం తెలిసిందే. సుమారు రూ.58వేల కోట్లు ఖర్చు తో ఈ ఒప్పిందం కుదిరింది. ఇప్పటి వరకు 14 రాఫెల్ యుద్ధ విమానాలు రాగా.. తాజాగా మరో నాలుగు యుద్ధ విమానాలతో భారత్ కు చేరుకున్నాయి. 

భారత వైమానిక దళ చీఫ్ మార్షల్ ఆర్కేఎస్ భదౌరియా ఫ్రాన్స్లోని మెరిగ్నాక్ వైమానిక దళ కేంద్రం నుంచి జెండా ఊపి వాటిని ప్రారంభించారు. భదౌరియా ఐదు రోజుల పర్యటనలో భాగంగా మూడో రోజు రాఫెల్‌ శిక్షణా కేంద్రాన్ని సందర్శించారు. యుద్ధ విమానాలు నేరుగా 8వేల కిలోమీటర్లు ప్రయాణించి దేశానికి చేరుకున్నాయి. ఈ నాలుగు యుద్ధ విమానాల రాకతోఫ్రాన్స్ నుంచి భారత్ కు చేరుకున్న విమానాల సంఖ్య 18కి చేరింది. మరో సగం అంటే.. 18 విమానాలు భారత్ కు రావాల్సి ఉంది. వచ్చే ఏడాది నాటికి మొత్తం రాఫెల్ జెట్లు భారత్‌కు చేరుకోనున్నాయి.