పెళ్లిబంధంతో ఒక్కటైన గుత్తా జ్వాల-విశాల్

కొన్నాళ్లుగా ప్రేమలో ఉన్న బ్యాడ్మింటన్ క్రీడాకారిణి, నటుడు విష్ణు విశాల్ వివాహబంధంతో ఒక్కటయ్యారు. మొయినాబాద్ లో ఈరోజు మధ్యాహ్నం 1:40నిలకు వీరి వివాహం జరిగింది. కరోనా దృష్ట్యా కొద్దిమంది బంధువులు, .సన్నిహితులు మాత్రమే ఈ వేడుకకి హాజరయ్యారు.

2005లో బ్యాడ్మింటన్ ప్లేయర్ చేతన్ ఆనంద్‌ను పెళ్లాడిన గుత్తా జ్వాల ఆ తర్వాత 2011లో విడాకులు తీసుకుంది. మరోవైపు 2010లో రజనీ నటరాజ్‌ని వివాహమాడిన విష్ణు విశాల్.. 2018లో ఆమె నుంచి విడాకులు తీసుకున్నారు. కొన్నేళ్లుగా గుత్తా జ్వాల-విశాల్ ప్రేమలో ఉన్నారు. గతేడాది సెప్టెంబరులో ఈ జంట నిశ్చితార్థం చేసుకున్న సంగతి తెలిసిందే.