అప్పుడే కరోనా కట్టడి సాధ్యం
ప్రభుత్వంలో మార్పు వస్తేనే కరోనా కట్టడి సాధ్యం అన్నారు తెదేపా యువనేత నారా లోకేష్. ఏపీలో పదో తరగతి, ఇంటర్ విద్యార్థులు పరీక్షల నిర్వహణపై ఆయన మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. పరీక్షలకు హాజరైన విద్యార్థులతో పాటు.. వాళ్ల కుటుంబ సభ్యులు కరోనా బారిన పడితే సీఎం జగన్ బాధ్యత తీసుకుంటారా ? అని ప్రశ్నించారు.
“ప్రభుత్వం మొండిగా పరీక్షలు నిర్వహించాలని చూస్తోంది. ఈ వైఖరితో విద్యార్థుల జీవితాలకే పరీక్ష పెడుతున్నారు. దేశంలో అనేక రాష్ట్రాలు పరీక్షలు వాయిదా వేస్తున్నాయి. ఆన్‌లైన్ క్లాసులకు హాజరై.. వ్యక్తిగతంగా పరీక్షలకు వెళ్లిన విద్యార్థులు కరోనా బారిన పడిన ఘటనలు రాష్ట్రంలో చోటు చేసుకున్నాయి. ప్రభుత్వంలో మార్పు వస్తేనే కరోనా కట్టడి సాధ్యం” అన్నారు లోకేష్.