‘రాధే’ ట్రైలర్ వచ్చేసింది

బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ తాజా చిత్రం ‘రాధే’. ప్రభుదేవా దర్శకుడు. సల్మాన్ కి జంటగా దిశా పటానీ నటిస్తోంది. మే 13న రాధే ప్రేక్షకుల ముందుకురానుంది. ఒకేసారి ఇటు థియేటర్స్ లో, అటు ఓటీటీలో సందడి చేయనుంది. #ZeePlexలో రిలీజ్ కానుంది. ‘పే ఫర్ వ్యూ’గా రిలీజ్ చేయనున్నారు.

తాజాగా ఈ సినిమా ట్రైలర్ ని విడుదల చేశారు. ఇదో యాక్షన్ ఎంటర్ టైనర్ అని ట్రైలర్ ని చూస్తే అర్థమవుతోంది. యాక్షన్ తో పాటు సల్మాన్ భాయ్ నవ్వులని పంచాడు. రాధే ట్రైలర్ ని చూస్తే.. ఇది మరో దబాంగ్ లా కనిపించింది. దబాంగ్ సినిమా తెలుగులో గబ్బర్ సింగ్ రిమేక్ అయి బ్లాక్ బస్టర్  హిట్ అయిన సంగతి తెలిసిందే. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కెరీర్ లోనే బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఇప్పుడు రాధే కూడా దబాంగ్ ఫార్మెట్ లోనే తెరకెక్కినట్టు ట్రైలర్ ని చూస్తే అర్థమవుతోంది.