ఒకే బౌలర్.. ముగ్గురిలా బౌలింగ్ చేస్తే.. !

 ఓ బౌలర్ జస్ప్రీత్‌ బుమ్రా, రవిచంద్రన్‌ అశ్విన్‌, హర్భజన్ సింగ్‌ల బౌలింగ్ యాక్షన్‌లను అనుకరించి ఆకట్టుకున్నాడు. బుమ్రా కూడా తన కంటే ఆ బౌలర్‌ యాక్షన్ బాగుందని కితాబివ్వడం విశేషం. ఇంతకీ ఆ బౌలర్‌ ఎవరో తెలుసా ? ఐపీఎల్‌లో రాజస్థాన్‌ రాయల్స్‌ తరఫున ఆడుతున్న శ్రేయాస్‌ గోపాల్. ఈ వీడియోని రాజస్థాన్ రాయల్స్ తన ట్విటర్‌ ఖాతాలో పోస్ట్ చేస్తూ.. ”జస్ప్రీత్. రవిచంద్రన్‌. హర్భజన్. శ్రేయాస్ గోపాల్” అనే వ్యాఖ్యను జత చేసింది.

”బుమ్రా ముందే అతనిలా బౌలింగ్‌ యాక్షన్‌ని అనుకరించా. నీ బౌలింగ్ యాక్షన్ నా కన్నా మెరుగ్గా ఉంది” అని బుమ్రా తనతో అన్నారని శ్రేయాస్‌ గోపాల్ ఆ వీడియో చివరిలో పేర్కొన్నాడు. ఇక మరికొద్దిసేపట్లో రాజస్థాన్ రాయల్స్.. బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ తో తలపడనుంది. కోహ్లీ, మాక్సివెల్, డిలివియర్స్ లాంటి భీకర బ్యాట్స్ మెన్స్ ఉన్న ఆర్సీబీని రాజస్థాన్ ఎలా అడ్డుకుంటుంది ? అన్నది ఆసక్తిగా మారింది. 

J̶a̶s̶p̶r̶i̶t̶.̶ ̶R̶a̶v̶i̶c̶h̶a̶n̶d̶r̶a̶n̶.̶ ̶H̶a̶r̶b̶h̶a̶j̶a̶n̶.̶ Shreyas Gopal ✅💗#HallaBol | #RoyalsFamily | #IPL2021 pic.twitter.com/I3hSeE8hJF— Rajasthan Royals (@rajasthanroyals) April 21, 2021