ఉచిత వాక్సిన్.. సోనియా డిమాండ్

18ఏళ్ల వయసు పైబడిన వారికి ఉచితంగానే కరోనా వ్యాక్సిన్ అందివ్వాలని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ డిమాండ్ చేశారు. దేశంలో వ్యాక్సిన్ విధానంపై సోనియా గాంధీ ప్రధాని మోదీకి లేఖ రాశారు.


“కరోనా వైరస్ మహమ్మారి గత ఏడాది నుంచి పౌరులకు కఠినమైన బాధలను కలిగిస్తూనే ఉంది. అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వం ఏకపక్ష, పక్షపాత విధానాలను అనుసరిస్తూనేవుంది. ఇలాంటి నిర్ణయాలు ఇప్పటికే ఉన్న సవాళ్లను మరింత పెంచుతాయి’ అని వ్యాక్సిన్ విధానంపై ప్రధానికి రాసిన లేఖలో సోనియాగాంధీ పేర్కొన్నారు.