సీపీఐతో టీఆర్ఎస్ పొత్తు కుదిరింది !
ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ-జనసేన పొత్తులు పెట్టుకుని రంగంలోకి దిగిన సంగతి తెలిసిందే. తాజాగా టీఆర్ఎస్ కూడా పొత్తు ప్లాన్ లోకి దిగింది. సీపీఐతో పొత్తు పెట్టుకుంది. ఆ పార్టీకి మూడు స్థానాలు కేటాయిస్తున్నట్లుగా మంత్రి పువ్వాడ అజయ్ ప్రకటించారు.
వాస్తవానికి టీఆర్ఎస్ పొత్తులకి దూరం. ప్రత్యేక తెలంగాణ వచ్చినప్పటి నుంచి పొత్తులకు పోవడం లేదు. ఒంటరిగానే బరిలోకి దిగుతోంది. విజయాలు నమోదు చేస్తోంది. కాకపోతే.. ఏదైనా రాజకీయంగా లోపాయికారీ రాజకీయాలు చేయడం వరకూ చేస్తున్నారు. ఐఎంఐతో అదే చేస్తున్నారు. అవసరం ఉన్నప్పుడు మాత్రమే ఆ పార్టీని వాడుకుంటున్నారు. అలాంటిది ఖమ్మంలో గులాభి పార్టీ పొత్తు ప్లాన్ తో వస్తోంది. ఖమ్మంలో కమ్యూనిస్టులకు ఇప్పటికీ క్యాడర్ ఉంది. బహుశా.. అందుకే సీపీఐతో టీఆర్ఎస్ పొత్తుకుపోయి ఉంటుంది.
ఇటీవల జరిగిన నాగార్జున సాగర్ ఉప ఎన్నికలోనూ కామ్రెడ్స్ తెరాసకు మద్దతు ఇచ్చిన సంగతి తెలిసిందే. నోముల నరసింహమ్మయ్య సీపీఐ నుంచి తెరాసలోకి వచ్చిన నేతనే. ఆయనపై ఉన్న అభిమానంతో సాగర్ ఉప ఎన్నిక బరిలో ఉన్న నోముల తనయుడు భగత్ కు కామ్రెడ్స్.. మద్దతు ఇచ్చారు.