మెగాస్టార్ పై గవర్నర్ ప్రశంసలు
గత యేడాది కరోనా విజృంభించిన సమయంలో మెగాస్టార్ చిరంజీవి పెద్ద మనసు చాటుకున్న సంగతి తెలిసిందే. చిరు ఆధ్వర్యంలో ఏర్పడిన ‘సిసిసి’ సంస్థ సినీ కార్మికులని ఆదుకుంది. ఉచితంగా నిత్యవసర సరుకులని పంపిణీ చేసింది. ఒకటికి రెండు సార్లు సినీ కార్మికులని ఆదుకుంది. ఇప్పుడు కరోనా వాక్సిన్ ని కూడా సినీ కార్మికులని ఉచితంగా అందిస్తామని చిరు ప్రకటించిన సంగతి తెలిసిందే. 45యేళ్లు దాటిన సినీ కార్మికులకి హైదరాబాద్ అపోల ఆసుపత్రి సహకారంతో ఉచితంగా టీకా అందిస్తామని తెలిపారు.
ఈ నేపథ్యంలో చిరంజీవిపై తెలంగాణ గవర్నర్ తమిళ సై సుందరాజన్ ప్రశంసలు కురిపించారు. ‘తెలుగు సినీ దిగ్గజ నటుడు శ్రీ చిరంజీవి గారు కరోనా క్రైసిస్ చారిటీ ద్వారా అపోలో సహకారం తో సినీ కార్మికులు, సినీ జర్నలిస్ట్ లకు ఉచిత వ్యాక్సినేషన్ ఇవ్వడానికి ముందుకు రావడం అభినందనీయం. ఇది ఒక మంచి ప్రయత్నం’ అని గవర్నర్ ట్విట్ చేశారు. గవర్నర్ ట్విట్ పై స్పందించిన చిరు ఆనందం వ్యక్తం చేశారు. సిసిసి సంస్థ కోసం విరాళాలు అందించిన ప్రతి ఒక్కరికి ఈ అభినందనలు దక్కుతాయి అన్నారు.
Thank you for your kind acknowledgement Madam Governor@DrTamilisaiGuv , on behalf of #CCC. Your appreciation means a lot to every member who is contributing to this initiative through #CoronaCrisisCharity ( #CCC) https://t.co/n6vgeCuznp— Chiranjeevi Konidela (@KChiruTweets) April 22, 2021