తెలుగు రాష్ట్రాల్లో అనధికారలాక్ డౌన్
తెలుగు రాష్ట్రాలో కరోనా ఉదృతి కొనసాగుతోంది. రోజువారీగా నమోదవుతున్న కేసుల సంఖ్య ఏపీలో 10వేలకు చేరువ కాగా.. తెలంగాణలో ఆ సంఖ్య 6వేలకు చేరువయ్యాయ్. ఇక రెండు రాష్ట్రాల్లో పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోతున్నారు. ఇప్పటికే తెలంగాణలో నైట్ కర్ఫ్యూ అమలులో ఉంది. ఏపీలో అయితే అదీ కూడా లేదు. పైగా 10, 12వ తరగతి పరీక్షలు నిర్వహించేందుకు కూడా ప్రభుత్వం సాహాసం చేస్తోంది. ప్రభుత్వం పెద్దగా పట్టించుకోకున్నా.. ఏపీ ప్రజలు మాత్రం అప్రమత్తంగానే ఉన్నారు.
స్వయ లాక్ డౌన్ పాటిస్తున్నారు. ఏపీలో అనధికార కర్ఫ్యూ, లాక్ డౌన్ కొనసాగుతోంది. కొన్నిచోట్ల ప్రజలు, వ్యాపారస్తులు స్వీయ లాక్ డౌన్ పాటిస్తున్నారు. మరికొన్ని చోట్ల మధ్యాహ్నం వరకే షాపులని తెరవాలని నిర్ణయం తీసుకున్నారు. ఇక రాత్రి వేళల్లో అనధికారిక కర్ఫ్యూ, లాక్ డౌన్ వాతావరణం కనిపిస్తోంది. ఇక తెలంగాణలోనూ అక్కడక్కడ ఈ పరిస్థితి కనిపిస్తోంది. టాలీవుడ్ సెల్ఫ్ లాక్ డౌన్ ని ప్రకటించిన సంగతి తెలిసిందే. థియేటర్స్ మూసేశారు. అత్యవసరం అయితే తప్ప షూటింగ్స్ కూడా నిర్వహించకూడని నిర్ణయం తీసుకున్నారు. ఇక తెలంగాణలోని కొన్ని కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్న కొన్ని గ్రామాలో స్వీయ లాక్ డౌన్ పాటిస్తున్నారు. మొత్తానికి.. తెలుగు రాష్ట్రాల్లో అనధికార లాక్ డౌన్ కొనసాగుతోంది.